Suicide: చదువుకోమని చెప్పారని.. 9 ఏళ్ల చిన్నారి ఆత్మహత్య
చదువుకోమని తల్లిదండ్రులు హెచ్చరిస్తూ స్నేహితుల ముందు తిట్టారనే కోపంతో తొమ్మిదేళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో ఆలస్యంగా వెలుగుచూసింది.
తిరువళ్లూర్: స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా తల్లిదండ్రులు వచ్చి చదువుకోమని హెచ్చరించడంతో తొమ్మిదేళ్ల చిన్నారి ఉరివేసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. తమిళనాడు (TamilNadu) లోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూర్ (Tiruvallur)కు చెందిన చిన్నారి ప్రతిక్ష (Pratiksha) నాలుగో తరగతి చదువుతోంది. ఇన్‌స్టాగ్రాంలో రీల్స్ చేస్తూ సరదాగా గడిపే తనని ఇరుగుపొరుగు వారు, స్నేహితులు ‘రీల్స్‌క్వీన్’ అని పిలుస్తుంటారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బంధువుల ఇంటి ముందు స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా... తల్లిదండ్రులు కృష్ణమూర్తి, కర్పగం చిన్నారిని ఇంటికి వెళ్లి చదువుకోమని హెచ్చరించారు.
చిన్నారికి తాళాలు ఇచ్చి వారు మార్కెట్‌కు వెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన చిన్నారి కిటికీ చువ్వకు తువ్వాలుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దాదాపు గంట తర్వాత తిరిగొచ్చిన తల్లిదండ్రులు తలుపులు లోపలి నుంచి గడియపెట్టి ఉండటం గమనించారు. తలుపును తీయమని కుమార్తెను కోరగా తను ఎంతకీ స్పందించలేదు. దీంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఆచేతన స్థితిలో ఉన్న తమ కుమార్తెను చూసి బిత్తరపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆలస్యమవడంతో చిన్నారి మృతి చెందింది. కేసు నమోదు చేసిన తిరువళ్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుల ముందు తల్లిదండ్రులు తిట్టారనే కోపంతోనే చిన్నారి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!