
Published : 30 Sep 2020 01:36 IST
కీసర మాజీ తహసీల్దార్ కేసు:ఐదుగురు అరెస్ట్
కీసర: మేడ్చల్ జిల్లా కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు లంచం కేసులో మరో ఐదుగురిని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)అధికారులు అరెస్ట్ చేశారు. కీసర తహసీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేశ్‌తో పాటు స్థిరాస్తి వ్యాపారులు శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, జగదీశ్వర్‌రావు, భాస్కర్‌రావులను అరెస్ట్ చేశారు. దీంతో పాటు నకిలీ పాసుపుస్తకాలు జారీ చేసిన కేసులో నాగరాజుపై మరో కేసు నమోదైంది.
గత నెలలో రూ.కోట్ల విలువైన భూమిని నిబంధనలకు విరుద్ధంగా స్థిరాస్తి వ్యాపారుల పేరు మీద మార్చడానికి మాజీ తహశీల్దార్ నాగరాజు రూ.రెండు కోట్లు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్ కలిసి నాగరాజుకు రూ.1.10కోట్ల లంచం ఇస్తుండగా పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే.
Tags :