హైదరాబాద్‌లో భారీగా హవాలా నగదు స్వాధీనం

నగరంలో భారీగా హవాలా నగదును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌ పరిధిలో రూ.కోటి హవాలా సొమ్మును వాహనాల్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

Published : 02 Nov 2020 00:59 IST

హైదరాబాద్‌: నగరంలో భారీగా హవాలా నగదును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌ పరిధిలో రూ.కోటి హవాలా సొమ్మును వాహనాల్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. అయితే ఈ సొమ్ము ఎక్కడిది? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అంశాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారణ చేపట్టారు. హవాలా సొమ్ము తరలింపుపై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ కాసేపట్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని