పులివెందుల ఎస్సైని ఢీ కొన్న వ్యక్తి అరెస్టు

కడప జిల్లా పులివెందులలో అక్రమంగా మద్యం రవాణా చేస్తూ ఎస్‌ఐ కారును ఢీ కొన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని సింహాద్రిపురానికి చెందిన నాగేశ్వర్‌రెడ్డిగా గుర్తించారు.

Updated : 29 Aug 2020 22:10 IST

పులివెందుల: కడప జిల్లా పులివెందులలో అక్రమంగా మద్యం రవాణా చేస్తూ కారుతో ఎస్సైని ఢీ కొన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని సింహాద్రిపురానికి చెందిన నాగేశ్వర్‌రెడ్డిగా గుర్తించారు. అతడిపై గతంలో పలు చోరీ కేసుల్లో అభియోగాలున్నట్లు పోలీసులు తెలిపారు.

అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్సై గోపీనాథరెడ్డి ప్రాణాలకు తెగించి సాహసం చేసిన విషయం తెలిసిందే. పట్టణంలోని రాఘవేంద్ర థియేటర్‌ సమీపంలో రోడ్డు పక్కన నిలబెట్టిన వాహనంలో అక్రమ మద్యం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు అక్కడికి ఎస్సై గోపీనాథరెడ్డి తన సిబ్బందితో చేరుకున్నారు. పోలీసులు వాహనాన్ని చుట్టుముట్టడంతో నిందితులు కారును వెనక్కు, ముందుకు కదుపుతూ పోలీసులను భయాందోళనలకు గురిచేశారు. కారును అడ్డుకునే క్రమంలో వాహనం ముందు భాగాన్ని ఎస్సై పట్టుకున్నారు. అయినప్పటికీ నిందితుడు కారును అతి వేగంగా నడుపుతూ సుమారు రెండు కి.మీ.దూరం వెళ్లాడు. ఎస్సై పట్టువిడువకుండా కారును గట్టిగా పట్టుకుంటూనే చాకచక్యంగా కారు ముందు అద్దాలను పగులగొట్టారు. ఇంతలో పోలీసులు చేరుకుని వాహనాన్ని అడ్డుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని 80 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని