Delhi: కోర్టులో సినిమా డైలాగ్‌ కొట్టి.. ఫర్నిచర్‌ విరగొట్టి!

చాలా సినిమాల్లో మనం కోర్టు సీన్లు చూశాం. కానీ.. ఓ వ్యక్తి కోర్టులోనే సినిమాని తలపించే విధంగా ఓ చిత్రంలోని డైలాగ్‌ చెప్పి, ఫర్నిచర్‌ విరగొట్టాడు. ఇంతకీ అసలేమైందంటే.. దిల్లీలోని శాస్త్రీనగర్‌కు చెందిన రాకేశ్‌ 2016నాటి ఓ కేసుకు సంబంధించి కర్కర్దూమా కోర్టులో విచారణకు హాజరవుతున్నాడు. ఐదేళ్లుగా విచారణ జరుగుతున్న

Updated : 23 Jul 2021 23:56 IST

దిల్లీ: చాలా సినిమాల్లో మనం కోర్టు సీన్లు చూశాం. కానీ.. ఓ వ్యక్తి కోర్టులోనే సినిమాని తలపించే విధంగా ఓ చిత్రంలోని డైలాగ్‌ చెప్పి, ఫర్నిచర్‌ విరగొట్టాడు. ఇంతకీ అసలేమైందంటే.. దిల్లీలోని శాస్త్రీనగర్‌కు చెందిన రాకేశ్‌ 2016నాటి ఓ కేసుకు సంబంధించి కర్కర్దూమా కోర్టులో విచారణకు హాజరవుతున్నాడు. ఐదేళ్లుగా విచారణ కొనసాగుతున్నా.. తీర్పు రాకపోవడంతో అసహనానికి గురయ్యాడు. ఇటీవల మరోసారి కోర్టులో విచారణకు హాజరైన రాకేశ్‌ విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. బాలీవుడ్‌ సినిమా ‘దామిని’లో నటుడు సన్నీ దేఓల్‌ చెప్పిన ‘తారీఖ్‌ పర్‌ తారీఖ్‌(రోజు తర్వాత రోజు)’ డైలాగ్‌ చెబుతూ.. కోర్టులో ఉన్న ఫర్నిచర్‌, కంప్యూటర్లను ధ్వంసం చేశాడు. న్యాయమూర్తి డయాస్‌ను కూడా విరగొట్టాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని