Airhostess death case: బాల్కనీ పైనుంచి జారిపడి ఎయిర్‌హోస్టెస్‌ మృతి.. బాయ్‌ఫ్రెండ్‌ అరెస్టు!

బెంగళూరులో భవనంపైనుంచి కింద పడి మృతిచెందిన ఎయిర్ హోస్టెస్‌ బాయ్‌ ఫ్రెండ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 13 Mar 2023 22:32 IST

బెంగళూరు: బెంగళూరు(Bengaluru)లో అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందకు పడి ఎయిర్‌ హోస్టెస్‌(Airhostess) అర్చనా ధిమన్‌ (28) శనివారం మృతి చెందిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఆమె బాయ్‌ ఫ్రెండ్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎయిర్‌ హోస్టెస్‌గా పనిచేస్తోన్న అర్చన.. ఈ ఘటన జరగడానికి నాలుగు రోజుల ముందే దుబాయి నుంచి బెంగళూరుకు వచ్చారు. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆదేశ్‌తో కలిసి కోరమంగల ఎనిమిదో బ్లాక్‌లోని ఓ అపార్టుమెంట్‌లో సహజీవనం చేస్తున్నారు.  

వీరిద్దరికీ ఓ డేటింగ్‌ సైట్‌ ద్వారా పరిచయం కావడంతో గత ఆరు నెలలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఆదేశ్‌ పోలీసుల విచారణలో  వెల్లడించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.  ఇద్దరి మధ్య తరచూ గొడవలు వస్తుండేవని.. ఈ ఘటన జరిగిన రాత్రి ఇద్దరూ  మద్యం తాగినట్టు చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు  జారి అర్చన  కిందకు పడిపోయిందని.. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు ఆదేశ్‌ పోలీసులకు వివరించాడు. ఈ ఘటనలో అతడి ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.  పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని