Telangana News: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు రామచంద్ర భారతిపై మరో కేసు

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతిపై మరో కేసు నమోదైంది. నకిలీ ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తయారు చేశారంటూ బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 08 Nov 2022 19:43 IST

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతిపై మరో కేసు నమోదైంది. నకిలీ ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తయారు చేశారంటూ బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తెరాస ఎమ్మెల్యలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ఇప్పటికే మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. అవినీతి నిరోధకశాఖ చట్టంలోని సెక్షన్‌ 8తో పాటు, పలు సెక్షన్ల కింద మొయినాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

రామచంద్రభారతి.. నకిలీ ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు మూడేసి చొప్పున నకిలీవి తయారు చేసి తన వద్దు పెట్టుకున్నాడని తెరాస ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోహిత్‌ ఫిర్యాదు ఆధారంగా.. రెండ్రోజుల క్రితమే పోలీసులు ఆయనపై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ వివరాలు వెల్లడించకుండా గోప్యత పాటించారు. ఇందుకు సంబంధించిన పలు కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తు్న్నారు. ఈకేసులో నేరం రుజువైతే రామచంద్రభారతికి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని