Punjab: పంజాబ్‌లో మళ్లీ అమృత్‌సర్‌ తరహా ఘటన.. ఒకరి మృతి

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో దైవద్రోహానికి పాల్పడ్డాడంటూ ఓ యువకుడిని భక్తులు తీవ్రంగా కొట్టడంతో అతను మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది జరిగిన 24 గంటల వ్యవధిలోపే రాష్ట్రంలోని కపుర్తలా జిల్లాలోనూ ఇదే తరహా మరో ఘటన చోటుచేసుకోవడం...

Updated : 20 Dec 2021 10:35 IST

చండీగఢ్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయంలో దైవద్రోహానికి పాల్పడ్డాడంటూ శనివారం ఓ యువకుడిని భక్తులు తీవ్రంగా కొట్టడంతో అతను మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది జరిగిన 24 గంటల వ్యవధిలోపే రాష్ట్రంలోని కపుర్తలా జిల్లాలోనూ ఇదే తరహా మరో ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నిజాంపూర్‌ గ్రామంలోని ఓ గురుద్వారా వద్ద పవిత్ర జెండా ‘నిషాన్‌ సాహిబ్‌’ను అపవిత్రం చేసేందుకు యత్నించాడంటూ ఓ వ్యక్తిపై భక్తులు ఆగ్రహంతో దాడికి దిగి కొట్టడంతో.. అతను మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

‘పోలీసులు, ఏ ఇతర ఏజెన్సీలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదు. ఈ తరహా కేసులకు పంజాబ్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా బాధ్యత వహిస్తాయి’ అంటూ ఆ సమయంలో గురుద్వారా నుంచి ఓ ప్రకటన వెలువడినట్లు సమాచారం. దీంతోపాటు ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడాలని అందులో కోరారు. దాడికి ముందే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటికీ.. అతన్ని తమ ముందే విచారించాలంటూ స్థానికులు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే పోలీసులతో వాగ్వాదానికి దిగిన వారు.. ఆ వ్యక్తిని కొట్టి చంపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని