ప్రగతిభవన్‌ వద్ద ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

ప్రగతిభవన్‌ గేటు వద్ద ఓ ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆటో డ్రైవర్‌ను అడ్డుకున్నారు...

Published : 18 Sep 2020 11:02 IST

హైదరాబాద్‌: ప్రగతిభవన్‌ గేటు వద్ద ఓ ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆటో డ్రైవర్‌ను అడ్డుకున్నారు. కిరోసిన్‌ పోసుకున్న అతడిపై నీళ్లు పోసి రక్షించారు. తెలంగాణ కోసం 2010లో అసెంబ్లీ వద్ద ఆత్మహత్యా్యత్నం చేశానని బాధితుడు వాపోయాడు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తనకు ఇల్లు కూడా మంజూరు చేయలేదంటూ నినాదాలు చేశాడు. ఆటోడ్రైవర్‌ను అడ్డుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని