Maharashtra: క్రికెట్‌లో వాగ్వాదం.. బ్యాటుతో కొట్టి చంపిన బాలుడు
మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ బాలుడు మరో మైనర్ బాలుడ్ని బ్యాటుతో కొట్టి ప్రాణాలు తీశాడు.
చంద్రాపుర్: మహారాష్ట్రలోని చంద్రాపుర్‌లో దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా ఏర్పడిన వివాదం ఒకరి హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే క్రికెట్ మ్యాచ్‌లో వాగ్వాదం ఏర్పడటంతో 13 ఏళ్ల అబ్బాయి మరో సహక్రీడాకారున్ని (12 సంవత్సరాలు) బ్యాటుతో కొట్టాడు. దీంతో ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. జూన్ 3న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. క్రికెట్ ఆడుతుండగా ఇద్దరు మైనర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో నిందితుడు బాలుడి తలపై బ్యాటుతో బలంగా బాదాడు. దీంతో అతను కుప్పకూలిపోయాడు. దీంతో మైదానంలో ఉన్నవారు అతడిని అక్కడున్న వారు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ జూన్ 5న ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృతుని తరఫున ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పోలీసు కేసు నమోదు చేయకుండానే బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం జూన్ 6న బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?