CBI: దిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. హైదరాబాద్‌లో సీబీఐ సోదాలు

దిల్లీ ఎక్సైజ్‌ పాలసీ వ్యవహారంలో హైదరాబాద్‌లోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది...

Updated : 19 Aug 2022 22:19 IST

హైదరాబాద్‌: దిల్లీ ఎక్సైజ్‌ పాలసీ వ్యవహారంలో హైదరాబాద్‌లోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ కోకాపేటలోని వ్యాపారి అరుణ్‌ రామచంద్రపిళ్లై నివాసంలో సీబీఐ బృందం సుమారు 4గంటల పాటు తనిఖీలు చేసింది. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్రపిళ్లై బెంగళూరులో నివసిస్తున్నారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండో స్పిరిట్‌ గ్రూప్‌ ఎండీతో పిళ్లైకి సంబంధాలు ఉన్నట్టు సీబీఐ అభియోగం. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న తెలుగు ఐఏఎస్‌ అధికారి గోపీకృష్ణ ఇంట్లోనూ  సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. గోపీకృష్ణ దిల్లీ ఎక్సైజ్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలోనే మద్యం దుకాణాల కేటాయింపులు జరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 31చోట్ల సీబీఐ దాడులు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని