Nizamabad: పరీక్షలు రాసి ఇంటికొచ్చిన కుమారుడు.. విగతజీవులుగా తల్లిదండ్రులు

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు పూర్తి చేసుకొని ఇంటికొచ్చిన కుమారుడు.. విగతజీవులుగా పడి ఉన్న  తల్లిదండ్రులను చూసి గుండెలవిసేలా రోదించాడు.

Published : 13 Mar 2024 17:33 IST

నిజామాబాద్‌ నేరవిభాగం: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు పూర్తి చేసుకొని ఇంటికొచ్చిన కుమారుడు.. విగతజీవులుగా పడి ఉన్న  తల్లిదండ్రులను చూసి గుండెలవిసేలా రోదించాడు. నిజామాబాద్‌లో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది.  పట్టణానికి చెందిన స్వామి (45), దేవలక్ష్మి (40) దంపతులకు కుమారుడు ఉన్నాడు. స్వామి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. బాలుడు డిచ్‌పల్లి మండలంలోని మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. బుధవారం వార్షిక పరీక్షలు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి దంపతులు ఇంట్లో ఉరేసుకొని కనిపించారు. 

స్వామి కొంత కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని బంధువులు తెలిపారు. ఈ క్రమంలోనే భార్యకు ఉరేసి, తాను కూడా బలవన్మరణానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని, మానసిక సమస్యలతోనే చనిపోతున్నట్లు ఆత్మహత్యకు ముందు ఫోన్‌లో స్వామి ఆడియో రికార్డు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని