Software Employee: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి రూ.46 లక్షలు కాజేసిన సైబర్ నేరస్థులు

సైబర్‌ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీరి ఆగడాలు రోజురోజుకీ పెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.46 లక్షలు కాజేశారు.

Updated : 09 Jul 2023 08:25 IST

సంగారెడ్డి: సైబర్‌ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీరి ఆగడాలు రోజురోజుకీ పెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.46 లక్షలు కాజేశారు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 28న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి చరవాణి వాట్సాప్ కు పార్ట్ టైం జాబ్ అంటూ మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఓపెన్ చేసి అందులో తన వివరాలను నమోదు చేయడంతో సదరు నేరస్థలు ఒక వేలెట్ ఐడీ క్రియేట్ చేశారు. వచ్చిన కమీషన్ వేలెట్ లో కనిపిస్తుందని నమ్మబలికారు. దీనికి గాను నగదు జమ చేయాల్సి ఉంటుందని చెప్పడంతో భార్య బంగారు ఆభరణాలు అమ్మి, జాబ్ రుణం తీసుకుని, స్నేహితుల నుంచి అప్పు తీసుకుని 35 సార్లు రూ.46 లక్షలు జమ చేశారు. తన నగదుతో పాటు వచ్చిన కమీషన్ కూడా ఇవ్వాలని అడిగినా స్పందించకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన ఉద్యోగి పోలీసులను ఆశ్రయించారు. తొలుత సైబర్ పోలీసులకు అనంతరం అమీన్‌ పూర్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని