Karnataka: బెంగళూరు విమానాశ్రయంలో.. రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

బెంగళూరు విమానాశ్రయంలో సుమారు రూ.10 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 20 Feb 2022 17:12 IST

బెంగళూరు: బెంగళూరు విమానాశ్రయంలో సుమారు రూ.10 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్టు పరిధిలోని అంతర్జాతీయ కొరియర్ టెర్మినల్ వద్ద ఈనెల 14న.. జాంబియా, బెల్జియం నుంచి వచ్చిన రెండు అనుమానాస్పద పార్శిళ్లను గుర్తించారు. వీటిలో ఒక కిలో హెరాయిన్ సహా 4.5 కిలోల ఇతర మత్తు పదార్థాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. తాజాగా తమిళనాడు ఈరోడ్ సమీపంలో నివాసముంటున్న ఓ నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని