Crime news: పానీపూరీ తింటున్న ముగ్గురు అక్కా చెల్లెళ్లపైకి దూసుకొచ్చిన కారు.. ఒకరి మృతి!
రోడ్డు పక్కన పానీపూరీ తింటున్న అక్కాచెల్లెళ్లపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నోయిడాలోని సదర్‌పూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
నోయిడా: రోడ్డు పక్కన పానీపూరీ తింటున్న అక్కాచెల్లెళ్లపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నోయిడాలోని సదర్‌పూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో డ్రైవర్ కారును నడపడం వల్ల జరిగిన ఈ దుర్ఘటనలో రియా అనే ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాలోని సెక్టార్ -45 సదర్‌పూర్ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అక్కా చెల్లెళ్లు రియా(6), అను(15), అంకిత(18) కలిసి పానీపూరీ తింటున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ రియా ఈరోజు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. అనూ అనే బాలిక వెన్నెముక దెబ్బతినగా.. అంకితకు స్వల్పంగా గాయాలయ్యాయని తెలిపారు. ఈ బాలికల తల్లి కూడా ఆ పరిసరాల్లోనే ఉన్నప్పటికీ ఆమె ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోగలిగిందన్నారు. నలుగురు వ్యక్తులతో వెళ్తున్న కారు అక్కడే పేర్చిన ఇటుకల్ని బలంగా ఢీకొట్టగా.. వీధివ్యాపారి బండి బోల్తా పడింది. దీంతో అక్కకి పెద్ద సంఖ్యలో చేరుకున్న జనం డ్రైవర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kumaraswamy: దేవేగౌడ తర్వాత నాకు కేసీఆరే స్ఫూర్తి: కుమారస్వామి
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం