Hyderabad: చిలిపి చేష్టలకు మూల్యం.. ఈవ్‌టీజర్‌కు 16 రోజుల జైలుశిక్ష

ఒంటరిగా వెళుతున్న మహిళపై ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన యువకుడికి నాంపల్లి కోర్టు 16 రోజుల జైలు శిక్ష విధించింది.

Updated : 16 Aug 2023 20:17 IST

హైదరాబాద్‌: ఒంటరిగా వెళుతున్న మహిళపై ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన యువకుడికి నాంపల్లి కోర్టు 16 రోజుల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హఫీజ్‌ బాబానగర్‌కు చెందిన ఓ మహిళ ఈనెల 11న కూరగాయల కోసం మార్కెట్‌కు ఒంటరిగా బయల్దేరింది. మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ అనే  యువకుడు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె వెనుకభాగంలో చేతులతో తాకి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. విచారణ అనంతరం ఇర్ఫాన్‌ అలీకి 10వ స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు 16 రోజుల జైలుశిక్ష విధించినట్టు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని