Telangana News: వారికి రైతుబంధు ఇవ్వొద్దు: ప్రభుత్వానికి అబ్కారీ శాఖ ప్రతిపాదనలు

తెలంగాణలో అంతర్గత పంటగా గంజాయి సాగు చేస్తూ లబ్ధి పొందుతున్న రైతులపై చర్యలు మొదలయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పొలాల్లో సోదాలు చేసిన అబ్కారీ

Published : 17 Mar 2022 01:23 IST

హైదరాబాద్: తెలంగాణలో అంతర్గత పంటగా గంజాయి సాగు చేస్తూ లబ్ధి పొందుతున్న రైతులపై చర్యలు మొదలయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పొలాల్లో సోదాలు చేసిన అబ్కారీ శాఖ అధికారులు 126 మంది రైతులు గంజాయి సాగుచేస్తున్నట్లు గుర్తించారు. వారందరిపై అబ్కారీ శాఖ అధికారులు గంజాయి కేసులు నమోదు చేశారు. ఇందులో ఎక్కువగా ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో నమోదైనట్లు అబ్కారీ శాఖ తెలిపింది. ఇటీవల కాలంలో మత్తుమందుల సరఫరా, విక్రయాలు, తయారీలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు, అబ్కారీ శాఖలను సీఎం ఆదేశించారు. గంజాయి సాగు చేసినట్లు గుర్తిస్తే సంబంధిత రైతులకు రైతు బంధు నిలుపుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గంజాయి సాగు చేస్తున్నట్లు కేసులు నమోదైన రైతులకు రైతుబంధు నిలుపుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని