Hyderabad: హబ్సిగూడలోని వస్త్రదుకాణం, రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం..

నగరంలోని హబ్సిగూడలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ హోటల్‌లో మంటలు చెలరేగాయి.

Updated : 02 Aug 2023 11:05 IST

హబ్సిగూడ (హైదరాబాద్‌): నగరంలోని హబ్సిగూడలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కాంప్లెక్స్‌లోని 2, 3వ అంతస్తుల్లో ఉన్న ఓ వస్త్ర దుకాణం, రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. 10 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా సమీపంలోని పెట్రోల్‌ బంకును పోలీసులు మూసివేయించారు. 

మరోవైపు అగ్నిప్రమాదం జరిగిన దుకాణాల అద్దాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. మంటలు అదుపులోకి తీసుకొచ్చినా ఇంకా దట్టంగా పొగలు వస్తుండంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అగ్నిప్రమాదం నేపథ్యంలో ఉప్పల్‌-హబ్సిగూడ మార్గంలో ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని