Visakhapatnam: నడి సంద్రంలో బోటులో అగ్ని ప్రమాదం.. 9 మంది మత్స్యకారులకు గాయాలు

చేపలవేటకు వెళ్లిన బోటు నడిసంద్రంలో అగ్ని ప్రమాదానికి గురైంది.

Published : 06 Apr 2024 00:06 IST

విశాఖ వన్‌టౌన్: చేపలవేటకు వెళ్లిన బోటు నడిసంద్రంలో అగ్ని ప్రమాదానికి గురైంది. విషయం తెలిసిన వెంటనే కోస్టుగార్డు నౌక రంగంలోకి దిగి బోటులోని మత్స్యకారులను రక్షించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కాకినాడ జిల్లా ఏటిమొగకు చెందిన 9 మంది మత్స్యకారులు గత నెల 24న కాకినాడకు చెందిన శ్రీదుర్గాభవాని బోటులో చేపల వేటకు బయలుదేరారు. శుక్రవారం విశాఖ తీరానికి 20నాటికల్‌ మైళ్ల దూరంలో వేట సాగిస్తుండగా జనరేటర్‌లో మంటలు చెలరేగి బోటును చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్‌ నౌక ‘వీర’ వెంటనే అక్కడికి చేరుకుని మంటల్లో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించింది. కోస్ట్‌గార్డ్‌ డీఐజీ రాజేష్‌ మిత్తల్‌ పర్యవేక్షణలో సహాయక కార్యక్రమాలు జరిగాయి. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరికొంత మంది స్పల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు మత్స్యశాఖ విశాఖ జిల్లా సహాయ సంచాలకులు విజయకృష్ణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని