Andhra News: పోలీసుల పేరుతో బెదిరించి రూ.89లక్షల దోపిడీ.. నిందితుల అరెస్టు

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వే జంక్షన్‌లో జరిగిన దోపిడీ  కేసును ఎట్టకేలకు రైల్వే పోలీసులు ఛేదించారు. ఈకేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.89లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు రైల్వే ఎస్పీ అనిల్‌ బాబు తెలిపారు. ..

Updated : 14 Mar 2022 05:43 IST

దాచేపల్లి : గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వే జంక్షన్‌లో జరిగిన దోపిడీ  కేసును ఎట్టకేలకు రైల్వే పోలీసులు ఛేదించారు. ఈకేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.89లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు రైల్వే ఎస్పీ అనిల్‌ బాబు తెలిపారు. వివరాల్లోకి వెళితే..  దుర్గి ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈనెల 7న చెన్నై వెళ్లడానికి నడికుడి రైల్వేస్టేషన్‌లో రెండో ప్లాట్‌ఫాంలో ఎస్‌ 6 బోగీ ఆగే ప్రదేశంలో రైలు కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో గోగులపాడు వెళ్లే రోడ్డు మార్గం నుంచి (రైల్వే ఖాళీ స్థలం) ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. ముగ్గురు ప్రయాణికులను కొట్టుకుంటూ పోలీసులు పిలుస్తున్నారని దూరంగా బలవంతంగా తీసుకువెళ్లి వారి వద్ద ఉన్న రెండు బ్యాగులను లాక్కొని తెల్లకారులో పారిపోయారు. బ్యాగుల్లో రూ.89 లక్షల నగదు ఉంది. ముగ్గురు వ్యక్తులు చెన్నైలో బంగారం కొనేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని రైల్వే ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.89లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని