భగత్‌సింగ్‌ను అనుకరించి.. ఉరికి వేలాడి!

స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌ను అనుకరించాలని ప్రయత్నించి ఓ విద్యార్థి మరణించాడు. ఉరితీసే సన్నివేశాన్ని ప్రయత్నించి ప్రమాదవశాత్తూ ఆ తాడుకే....

Published : 07 Feb 2020 00:41 IST

భోపాల్‌: స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌ను అనుకరించాలని ప్రయత్నించి ఓ విద్యార్థి మరణించాడు. ఉరితీసే సన్నివేశాన్ని ప్రయత్నించి ప్రమాదవశాత్తూ ఆ తాడుకే బలయ్యాడు. ఈ విషాదం మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి అఫ్జల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న శ్రేయాన్ష్‌ (12).. ఇటీవల పాఠశాల వార్షికోత్సవ వేడుకలో ఓ నాటికలో నటించాడు. అందులో ఓ బ్రిటీష్‌ అధికారి పాత్ర పోషించాడు.

ఆ మరుసటి రోజు ఇంట్లో ఉన్న సమయంలో భగత్‌సింగ్‌ జీవితానికి సంబంధించిన సన్నివేశాలను శ్రేయాన్ష్‌ మొబైల్‌లో చూశాడు. అందులో ఉరి తీసే సన్నివేశాన్ని ప్రయత్నించాడు. పొరపాటున పట్టు తప్పడంతో ఊపిరాడక మరణించాడని ఎస్పీ హితేష్‌ చౌధురి తెలిపారు. అయితే, అంతకుముందు రోజు పోషించిన పాత్రకు.. భగత్‌ సింగ్‌ పాత్రకు సంబంధం లేదని, అయినా శ్రేయాన్ష్‌కు ఆ ఆలోచన ఎందుకొచ్చిందో తెలీదని స్కూల్‌ ప్రిన్సిపల్‌ తెలిపారు. ముందు రోజు నాటికలోనూ అలాంటి సన్నివేశాలు లేవని తెలిపారు. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని ఎస్పీ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని