అనుమానం కలిగి.. ఆటోలోంచి దూకి!

మహారాష్ట్రలోని ముంబయిలో ఓ ఆటో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. డ్రైవర్‌ తప్పు మార్గంలో తీసుకెళ్తున్నానని బెదిరించే సరికి ఆటోలోంచి దూకడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 16 Feb 2020 00:39 IST

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో ఓ ఆటో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. డ్రైవర్‌ ఆటో మార్గాన్ని మార్చేసరికి భయంతో ఆ యువతి ఆటోలోంచి దూకడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి ముంబయిలోని పంచరత్న ప్రాంతానికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. కొద్ది దూరం ప్రయాణించిన అనంతరం డ్రైవర్‌ అద్దంలోంచి ఆమె వైపు చూస్తూ.. ఆటో తాను వెళ్లాలనుకున్న ప్రదేశానికి మాత్రమే వెళ్తుందని ఆమెను బెదిరించాడు. అనంతరం వాహనాన్ని తప్పు మార్గంలో మళ్లించాడు. దీంతో భయాందోళనకు గురైన యువతి.. ప్రమాదం జరుగుతుందేమోనని అనుమానంతో ఏకంగా కదులుతున్న ఆటోలోంచి దూకేసింది. ఈ క్రమంలో ఆమె తల స్పీడ్‌ బ్రేకర్‌కు తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. అనంతరం రహదారిపై వెళ్తున్న వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని