బాయ్‌ఫ్రెండ్‌తో ఉండగా.. తల్లి రావడంతో!

బాయ్‌ఫ్రెండ్‌తో ఇంట్లో ఉండగా తల్లి వచ్చిందన్న భయంతో మొదటి అంతస్థు నుంచి దూకిన బాలికకు ప్రాణాపాయం తప్పింది. ముంబయిలోని కుర్లా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 09 Mar 2020 02:08 IST

ముంబయి: బాయ్‌ఫ్రెండ్‌తో ఇంట్లో ఉండగా తల్లి వచ్చిందన్న భయంతో మొదటి అంతస్థు నుంచి దూకిన బాలికకు ప్రాణాపాయం తప్పింది. ముంబయిలోని కుర్లా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్లా ప్రాంతానికి చెందిన ఓ బాలిక(17) ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంది. ఈ క్రమంలో వారిద్దరూ ఇంట్లో ఏకాంతంగా ఉండగా అకస్మాత్తుగా తల్లి రావడాన్ని బాలిక గమనించింది. దీంతో దొరికిపోతామేమో అనే భయంతో మొదటి అంతస్థులో ఉన్న ఇంటి బెడ్‌రూమ్‌ కిటికీలోంచి బయటకు దూకింది. ఈ క్రమంలో బాలికకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం యువకుడు(20) అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకుడిని గుర్తించి అరెస్టు చేశారు. బాలికలపై లైంగిక వేధింపుల చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని