ఆశావర్కర్లపై దురుసు ప్రవర్తన..కౌన్సిలర్‌ అరెస్టు

ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా కార్యకర్తపై దాడి యత్నాన్ని మర్చిపోక ముందే... ఇవాళ నిర్మల్‌ జిల్లాలో ఆశా కార్యకర్తలపై ఓ కౌన్సిలర్‌ దురుసుగా ప్రవర్తించాడు. కరోనా

Published : 05 Apr 2020 01:28 IST

నిర్మల్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా కార్యకర్తపై దాడి యత్నాన్ని మర్చిపోక ముందే... ఇవాళ నిర్మల్‌ జిల్లాలో ఆశా కార్యకర్తలపై ఓ కౌన్సిలర్‌ దురుసుగా ప్రవర్తించాడు. కరోనా నేపథ్యంలో కబూతర్‌ కమాన్‌లో సర్వే చేపట్టిన ఆశా కార్యకర్తలకు సహకరించబోమని కౌన్సిలర్‌ జహీర్‌ జులుం చేసే ప్రయత్నం చేశారు. ఆయన వ్యవహార శైలిపై ఆశా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను ఏఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. నిర్మల్‌ నుంచి దాదాపు 52 మంది దిల్లీలో నిర్వహించిన మత ప్రచారసభలో పాల్గొని వచ్చారు. రెండ్రోజుల కిందటే అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌ సోకి చనిపోయిట్లు జిల్లా పాలనాధికారి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆశా వర్కర్లు ఆ ప్రాంతంలో సర్వే నిర్వహించేందుకు వెళ్లగా స్థానిక కౌన్సిలర్‌ అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని