గుత్తి క్వారంటైన్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత 

అనంతపురం జిల్లా గుత్తిలోని శ్రీకృష్ణదేవరాయల ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రం వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. క్వారంటైన్‌లో ఉన్న మహారాష్ట్రకు చెందిన కొందరు తమను స్వస్థలానికి

Published : 14 Apr 2020 01:31 IST

రాళ్లు రువ్విన బాధితులు 
కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలు

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తిలోని శ్రీకృష్ణదేవరాయల ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రం వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. క్వారంటైన్‌లో ఉన్న మహారాష్ట్రకు చెందిన కొందరు తమను స్వస్థలానికి పంపాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం సాయంత్రం పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో అలీ అనే కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మహారాష్ట్రకు చెందిన సుమారు 50 మంది గత 14 రోజులుగా క్వారంటైన్‌లో ఉంటున్నారు. తమకు కరోనా లక్షణాలు లేవని వైద్యులు ధ్రువీకరించినప్పటికీ సొంత గ్రామాలకు పంపడం లేదని అధికారులతో వాదనకు దిగారు. విషయం తెలుసుకున్న గుత్తి పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు క్వారంటైన్‌కు వెళ్లగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై రాళ్లు రువ్వారు. రాత్రి కలెక్టర్‌ గంధం చంద్రుడు రానున్నారని, స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు, పోలీసులు హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని