లాక్‌డౌన్‌ వేళ అమ్మాయి పేరిట సైబర్‌ వల!

లాక్‌డౌన్‌ వేళ సైబర్‌ నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న ఆన్‌లైన్‌లో మద్యం సరఫరా చేస్తామంటూ ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.3 లక్షలకుపైగా టోకారా వేసిన సైబర్‌ నేరగాళ్లు

Published : 21 Apr 2020 01:03 IST

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ వేళ సైబర్‌ నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న ఆన్‌లైన్‌లో మద్యం సరఫరా చేస్తామంటూ ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.3 లక్షలకుపైగా టోకారా వేసిన సైబర్‌ నేరగాళ్లు తాజాగా.. కావాల్సిన చోటికి అమ్మాయిల్ని పంపిస్తామంటూ మరో మోసానికి తెగబడ్డారు. ‘‘ మీకు అమ్మాయి కావాలంటే ఈ నెంబర్‌కు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. గంటలో అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది’’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దీంతో హైదరాబాద్‌లోని బొల్లారం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అవతలి వారు అమ్మాయి అనుకొని ఛాటింగ్‌ చేశాడు. వారు పంపించిన బ్యాంకు అకౌంట్లకు రూ.91వేలు ఆన్‌లైన్‌ద్వారా పంపించాడు. డబ్బులు అకౌంట్‌లో జమకాగానే సైబర్‌ నేరగాళ్లు తమ మొబైల్‌ నెంబర్‌ను బ్లాక్‌ చేశారు. దీంతో మోసపోయిటన్లు గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని