
విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండలోని బాలాజీ థియేటర్ సమీపంలో నివసిస్తున్న రమేశ్, మల్లేశ్ అనే ఇద్దరు సోదరులు మంగళవారం ఉదయం విద్యుదాఘాతంతో మృతిచెందారు. వేకువజామున బహిర్భూమికి వెళ్లిన వీరు.. నీటి ట్యాంక్ చుట్టూ ఉన్న ఇనుప కంచెను తాకారు. దానికి విద్యుత్ సరఫరా ఉండడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
గుర్తించిన కుటుంబసభ్యులు మృతదేహాలను ప్రధాన రోడ్డుపై ఉంచి రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు జోక్యం చేసుకుని బంధువులకు నచ్చజెప్పి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ శాఖ ఏఈ మురళీకృష్ణ సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.