Crime News: క్యాబ్‌ బుక్‌ చేసుకొని.. మార్గమధ్యలో దారి మళ్లించి

క్యాబ్‌ కావాలని ఓ మొబైల్‌ యాప్‌లో బుక్‌ చేసుకున్నాడు.. తీరా ఎక్కిన తర్వాత మార్గమధ్యలో క్యాబ్‌ నిర్వాహకుడిని దారి మళ్లించి పథకం ప్రకారం....

Updated : 07 Mar 2022 06:46 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: క్యాబ్‌ కావాలని ఓ మొబైల్‌ యాప్‌లో బుక్‌ చేసుకున్నాడు.. తీరా ఎక్కిన తర్వాత మార్గమధ్యలో క్యాబ్‌ నిర్వాహకుడిని దారి మళ్లించి పథకం ప్రకారం మరో మిత్రుడితో కలిసి చోరీకి ఒడిగట్టిన సంఘటన గన్నవరం స్టేషన్‌ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ కృష్ణలంక బాలాజీ నగర్‌కు చెందిన కొడాలి పృథ్వీరాజ్‌ ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ.. పార్ట్‌టైంగా ర్యాపిడ్‌ బైక్‌ క్యాబ్‌ సర్వీసులో చేరాడు. యథావిధిగా శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ బుకింగ్‌ వచ్చింది. దీంతో కస్టమర్‌ దగ్గరకు వెళ్లగా అతడు గన్నవరం వెళ్లాలని బదులిచ్చాడు. అంగీకరించిన పృథ్వీరాజ్‌.. అతడిని బైక్‌పై ఎక్కించుకొని గన్నవరం సమీపంలోని కేసరపల్లి కూడలికి చేరుకోగా.. సావరగూడెం వైపునకు వెళ్లాలన్నాడు. అప్పటికే వేచిచూస్తున్న స్నేహితుడితో కలిసి వెనుక కూర్చున్న ఆ కస్టమర్‌ పృథ్వీరాజ్‌పై దాడికి పాల్పడ్డాడు. పృథ్వీరాజ్‌ నుంచి ద్విచక్ర వాహనంతో పాటు ఏటీఎమ్‌ కార్డు, సెల్‌ఫోన్‌, రూ.వంద నగదు చోరీ చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన పృథ్వీరాజ్‌ను కామినేని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని