Updated : 28 Jun 2022 06:47 IST

పెళ్లి పేరుతో యువతి టోకరా!

వీఆర్వో, ఆమె కుమార్తెపై ఎస్పీ కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు


బాధితులు ఎస్పీకి ఇచ్చిన శుభలేఖ

నెహ్రూనగర్‌ (గుంటూరు), న్యూస్‌టుడే : లక్షలాది రూపాయలు కట్నకానుకలు తీసుకొని పెళ్లి చేసుకొని మోసగించాడంటూ మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఓ యువతిపై బాధితుడు సోమవారం పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. వివరాలు బాధితుల మాటల్లోనే.. ‘నేను బీటెక్‌ చదివాను. ప్రస్తుతం గుంటూరులో మోటార్‌ కంట్రోలర్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాను. తండ్రి పోలియోతో, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక్కడినే కుమారుడి. రెవెన్యూశాఖలోని ఓ విశ్రాంత ఉద్యోగి పరిచయమై జిల్లాలోని ఓ వీఆర్వో కుమార్తెతో వివాహం కుదిర్చారు. తండ్రిలేరని తాను కట్నం ఇచ్చుకోలేనని తల్లి చెప్పడంతో పైసా కట్నంలేకుండా పెళ్లికి అంగీకరించాం. ఫిబ్రవరిలో వివాహమైంది. అమ్మాయికి రూ. 2 లక్షలతో ఆభరణాలు చేయించాం. మా ఊరులో రూ. 6 లక్షలతో రిసెప్షన్‌ చేశాం. వెంటనే ఆమె తన కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లింది. తొలిరాత్రి నుంచి యువతి నన్ను దూరంపెట్టింది. ఒక్కరోజు కూడా కాపురం చేయలేదు. నెలల తరబడిగా ఆమె పుట్టింటి నుంచి రావడంలేదు. మా పెద్దలు వెళ్లి అడిగితే గుంటూరులో ఇల్లు అద్దెకు తీసుకోమన్నారు. ఒకరోజు ఉండి తనను తాకవద్దంటూ రెండోరోజు పుట్టింటికి వెళ్లిపోయింది. గట్టిగా నిలదీయడంతో కట్నం ఇవ్వమంటున్నారని మాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 10 లక్షల డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ సమయంలోనే మాకు తెలిసింది మా అత్త వీఆర్వోగా పనిచేసిన గ్రామంలో గతేడాది ఓ ఎయిర్‌ఫోర్సు ఉద్యోగితో నిశ్చితార్థం చేశారట. ఆ విషయం దాచిపెట్టి మాతో వివాహమంటూ తతంగం నడిపారు. మరొకరితో పెళ్లి తంతు నడుపుతూ నా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారనిపిస్తోంది. మమ్మల్ని మోసగించిన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరాం’ అని తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని