రాత్రివేళ ద్విచక్ర వాహనాల చోరీ

రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలు చోరీ చేసే ఐదుగురు దొంగలను అరెస్టు చేసినట్లు తిరుపతి తూర్పు సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఆదివారం సాయంత్రం మంగళం పోలీసు అవుట్‌ పోస్టులో జరిగిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు.

Updated : 04 Jul 2022 06:17 IST

ఐదుగురు దొంగల అరెస్టు


స్వాధీనం చేసుకున్న వాహనాలు పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ తదితరులు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలు చోరీ చేసే ఐదుగురు దొంగలను అరెస్టు చేసినట్లు తిరుపతి తూర్పు సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఆదివారం సాయంత్రం మంగళం పోలీసు అవుట్‌ పోస్టులో జరిగిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. ఆదివారం ఉదయం వచ్చిన సమాచారం మేరకు అలిపిరి - జూపార్కు రోడ్డులో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. తిరుపతి కొర్లగుంటకు చెందిన మట్లి రామకృష్ణ (21), పీలేరు మండలం గుర్రంవారిపల్లికి చెందిన రొంపిచెర్ల హరిప్రసాద్‌ (24), చంద్రగిరి పాతపేటకు వాసి పాలపాటి అకిలేశ్వర్‌ రెడ్డి(24), తిరుపతి గాంధీపురానికి చెందిన పసుపర్తి హర్షవర్ధన్‌(19), తిరుచానూరు సమీపంలోని పాడిపేటకు చెందిన ఎ.రాజేష్‌ (21)గా గుర్తించారు. వారిని విచారించగా అలిపిరి, తిరుపతి తూర్పు, ఎంఆర్‌పల్లి, శ్రీకాళహస్తి 1టౌన్‌, 2టౌన్‌, చంద్రగిరి, తిరుచానూరు, సూళ్లూరుపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో రాత్రి వేళ ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు అంగీకరించారు. వారి నుంచి రూ.7.50 లక్షల విలువైన 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన అలిపిరి సీఐ అబ్బన్న, ఎస్‌ఐ చిన్న రెడ్డెప్ప, సిబ్బంది రవిరెడ్డి, ప్రసాద్‌, రాజశేఖర్‌ను అభినందిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని