అప్పుల బాధతో మహిళా రైతు బలవన్మరణం

అప్పుల బాధతో మహిళా రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనిది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రావిపాడుకు చెందిన షేక్‌ సైదాబి (51) తమకున్న 4 ఎకరాలతో పాటు మరో 21 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు.

Published : 07 Feb 2023 05:21 IST

పెదనందిపాడు, న్యూస్‌టుడే: అప్పుల బాధతో మహిళా రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనిది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రావిపాడుకు చెందిన షేక్‌ సైదాబి (51) తమకున్న 4 ఎకరాలతో పాటు మరో 21 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. అందులో మిర్చి,  సెనగ, ఇతర పంటలు సాగు చేశారు. చీడపీడలు ఆశించి పైర్లు దెబ్బతిన్నాయి. వ్యవసాయం కోసం చేసిన అప్పు రూ.50లక్షలు తీర్చే మార్గం లేకపోవడంతో మనస్తాపం  చెంది  సోమవారం ఇంట్లో పురుగు మందు తాగారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రత్తిపాడు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించారు. భర్త మస్తాన్‌వలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు