గ్యాస్‌లీకై మహిళా కార్మికులకు అస్వస్థత

తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని కార్బన్‌ పరిశ్రమలో బుధవారం గ్యాస్‌ లీకై 11 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.

Published : 30 Mar 2023 05:40 IST

కార్బన్‌ పరిశ్రమలో సంఘటన
ముగ్గురి పరిస్థితి విషమం 

రేణిగుంట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని కార్బన్‌ పరిశ్రమలో బుధవారం గ్యాస్‌ లీకై 11 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అందులో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. కార్బన్‌ పరిశ్రమలో నియోలింక్స్‌ విభాగంలో ఒక మొబైల్‌ కేబుల్‌ పరిశ్రమకు చెందిన బాక్సులను తయారు చేస్తుంటారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే సుమారు 150 మంది మహిళా కార్మికులు పనులు చేస్తున్నారు. ఇందులో ఒక విభాగంలో గ్యాస్‌ లీకై అక్కడే పని చేస్తున్న చందన, రీటా, సుప్రియ, శిరీష, విజయ, విమల, జయంతి, భూమిక, ఎన్‌.శిరీష, అలేఖ్య, రిమి కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న బాలాజీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో సుప్రియ, శిరీష, అలేఖ్య ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అమర ఆస్పత్రికి తరలించినట్లు బాలాజీ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. గాజులమండ్యం ఎస్సై ధర్మారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు