బస్సులో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన.. వీడియో తీసి అరెస్టు చేయించిన యువతి

బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి చేష్టలను వీడియో తీసి పోలీసులకు పట్టించిందో యువతి. కేరళ ఎర్నాకుళం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 19 May 2023 08:52 IST

కొచ్చి: బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి చేష్టలను వీడియో తీసి పోలీసులకు పట్టించిందో యువతి. కేరళ ఎర్నాకుళం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ యువతి బుధవారం బస్సులో వెళ్తుండగా, నిందితుడు సయ్యద్‌ ఆమె పక్క సీట్లో కూర్చొని అసభ్యంగా తాకడంతోపాటు తన మర్మాంగాన్ని బహిర్గతం చేసి వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. దీనిపై ఆ యువతి సయ్యద్‌ను నిలదీసింది. మొబైల్‌ ఫోన్‌తో వీడియో తీస్తూ ప్రశ్నించింది. పారిపోబోతున్న నిందితుణ్ని కండక్టరు సాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించింది. అనంతరం ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని