ఠాణా ఎదుట అన్నదాత బలవన్మరణం

అప్పుల బాధ, కుటుంబ కలహాలను తాళలేక ఓ రైతు ఠాణా ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో బుధవారం జరిగింది.

Published : 01 Jun 2023 04:05 IST

కుటుంబ కలహాలు, అప్పుల బాధలే కారణం

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: అప్పుల బాధ, కుటుంబ కలహాలను తాళలేక ఓ రైతు ఠాణా ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో బుధవారం జరిగింది. ఎస్‌ఐ విజేందర్‌, స్థానికులు తెలిపిన ప్రకారం... సుల్తానాబాద్‌ మండలం గొల్లపల్లికి చెందిన ఎలవేణి రాజయ్య(55) నాలుగేళ్ల క్రితం మస్కట్‌ వెళ్లి వచ్చి, మూడెకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎడారి దేశానికి వెళ్లడానికి చేసిన అప్పులు, కుమార్తె వివాహం చేసే విషయమై భార్య కోమలతో మంగళవారం రాజయ్య గొడవ పడ్డాడు. దీంతో కోమల తన కుమారుడు, కుమార్తెతో కలిసి సుల్తానాబాద్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. మనస్తాపానికి గురైన రాజయ్య బుధవారం సుల్తానాబాద్‌లో పురుగుల మందు కొనుక్కుని, తాగుతూ వస్తూ ఠాణా ఎదుటే పడిపోయాడు. గమనించిన పోలీసులు ఆయన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్‌ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు