మొసలిని కొట్టి చంపిన గ్రామస్థులు

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం కంబళదిన్నె గ్రామ ఎస్సీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి మొసలి హల్‌చల్‌ చేసింది.

Published : 06 Jun 2023 04:40 IST

కర్నూలు జిల్లాలో ఘటన

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం కంబళదిన్నె గ్రామ ఎస్సీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి మొసలి హల్‌చల్‌ చేసింది. భయాందోళనలకు గురైన కాలనీవాసులు దానిని కొట్టి చంపారు. గ్రామానికి సమీపంలో వగరూరు జలాశయం నుంచి వాగు ద్వారా మొసలి ఆ ప్రాంతానికి చేరుకుంది. వేసవి కావడంతో కాలనీలో చాలా మంది ఇళ్ల ఎదుట నేలపై నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి ఓ యువకుడు మూత్ర విసర్జనకు నిద్ర లేచి.. అక్కడే ఉన్న మొసలిని చూసి కేకలు వేశాడు. వెంటనే ఇరుగుపొరుగు వచ్చి కర్రలతో కొట్టినా పారిపోకుండా మొసలి వారిపైకి తిరగబడింది. అప్రమత్తమైన కాలనీవాసులు వెంటనే గడ్డపారలు తీసుకొచ్చి చంపేశారు. అనంతరం ఉదయం వరకు తాడుతో చెట్టుకు కట్టేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని