Eluru: ప్రభుత్వం ఇచ్చిన ఇంటికి అప్పు తీర్చలేక కూలీ ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని ప్రగడపల్లిలో చోటు చేసుకుంది.

Updated : 16 Oct 2023 09:27 IST

పోలవరం, న్యూస్‌టుడే: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని ప్రగడపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కడిమి సుబ్రహ్మణ్యం(24) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి నిర్మాణానికి సుమారు రూ.4 లక్షలు అప్పు చేశారు. ప్రస్తుతం ఎక్కడా కూలీ పనులు దొరక్కపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఈ నెల 13న పురుగుల మందు తాగారు. గమనించిన బంధువులు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా చాగల్లులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందడంతో ఆదివారం మృతదేహాన్ని పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. భార్య మౌనిక ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. శవపరీక్షఅనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని