Krishna: ఖాతాదారుల 10.6 కిలోల బంగారంతో ఉడాయించిన ఉద్యోగిని

కృష్ణా జిల్లా కంకిపాడులోని మణప్పురం గోల్డ్‌లోన్‌ ఫైనాన్స్‌ బ్రాంచిలో పనిచేసే ఓ ఉద్యోగిని 10.660 కిలోల బంగారంతో ఉడాయించింది.

Updated : 19 Oct 2023 07:55 IST

కంకిపాడు మణప్పురం ఫైనాన్స్‌ బ్రాంచిలో ఘటన

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా కంకిపాడులోని మణప్పురం గోల్డ్‌లోన్‌ ఫైనాన్స్‌ బ్రాంచిలో పనిచేసే ఓ ఉద్యోగిని 10.660 కిలోల బంగారంతో ఉడాయించింది. పోలీసుల కథనం ప్రకారం.. రెడ్డివెంకట పావని ఆభరణాలు తాకట్టు పెట్టుకుని, భద్రపర్చే విభాగంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పనిచేస్తోంది. బ్రాంచిలో 951 మంది ఖాతాదారులకు చెందిన 10.660 కిలోల బంగారాన్ని పావని సోమవారం రాత్రి మరో వ్యక్తితో కలిసి దొంగిలించింది. వాటి విలువ సుమారు రూ.6 కోట్లకు పైగా ఉంటుందని తేల్చారు. దీనిపై మంగళవారం కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రాంచిలో సీసీ కెమెరాలు రెండు నెలలుగా పని చేయడం లేదని పోలీసులు గుర్తించారు. పావని, మరో వ్యక్తి కలిసి బ్యాగుతో కారులో వెళ్లినట్లుగా స్థానిక లాకు రోడ్డులోని సీసీ కెమెరా ఫుటేజీలో ఉంది. పావనికి సహకరించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బుధవారం బ్రాంచిలోని దస్త్రాలను తనిఖీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని