Chittoor: బొమ్మ తుపాకీ కాదంటూ కాల్చి చూపించిన మాజీ జవాను

తన వద్ద ఉన్నది బొమ్మ తుపాకీ అంటూ స్నేహితులు హేళన చేయడంతో సహనం కోల్పోయిన ఓ మాజీ సైనికుడు బార్‌లో కాల్పులు జరిపిన ఘటన ఇది.

Updated : 01 Feb 2024 10:53 IST

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: తన వద్ద ఉన్నది బొమ్మ తుపాకీ అంటూ స్నేహితులు హేళన చేయడంతో సహనం కోల్పోయిన ఓ మాజీ సైనికుడు బార్‌లో కాల్పులు జరిపిన ఘటన ఇది. చిత్తూరుకు చెందిన మల్లికార్జున 2021లో సైన్యం నుంచి పదవీ విరమణ పొందాడు. విధుల్లో ఉన్న సమయంలోనే లైసెన్సుతో ఓ పిస్టల్‌ కొనుగోలు చేశాడు. మంగళవారం రాత్రి స్థానికంగా ఉన్న ఓ బార్‌కు స్నేహితులతో కలిసి వెళ్లారు. మద్యం తాగుతున్న క్రమంలో తన దగ్గర ఉన్న పిస్టల్‌ నిజమైనది కాదంటూ స్నేహితులు గేలి చేయడాన్ని మల్లికార్జున సహించలేకపోయాడు. అసహనానికి గురై పిస్టల్‌ను తీసి నేలవైపు గురిపెట్టి ఒక రౌండ్‌ కాల్పులు జరిపాడు. దీంతో బార్‌లో ఉన్నవారందరూ భయపడి పారిపోగా.. నిందితుడూ చల్లగా జారుకున్నాడు. స్థానికులు డయల్‌-100కు సమాచారం ఇవ్వడంతో చిత్తూరు పోలీసులు వచ్చి పరిశీలించారు. బుధవారం ఉదయం బుల్లెట్‌ అవశేషాలు, ఖాళీ తుపాకీ కేస్‌లు స్వాధీనం చేసుకుని మల్లికార్జునను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రస్తుతం ఆర్‌పీఎఫ్‌లో కాంట్రాక్టు పద్ధతిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని