సివిల్స్‌ మూడో ర్యాంకర్‌ అనన్యరెడ్డి పేరుతో నకిలీ ఖాతాలు

తన పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సివిల్స్‌ మూడో ర్యాంకర్‌ అనన్యరెడ్డి సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated : 01 May 2024 06:43 IST

కేసు నమోదు

ఈనాడు- హైదరాబాద్‌: తన పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సివిల్స్‌ మూడో ర్యాంకర్‌ అనన్యరెడ్డి సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సివిల్స్‌ శిక్షణకు మార్గదర్శకత్వం చేస్తామంటూ కొందరు ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌, టెలిగ్రామ్‌లలో ఖాతాలు తెరిచి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ నకిలీ ఖాతాల్ని భారీగా ఫాలో అవుతున్నారని.. ఇదే అవకాశంగా కొన్ని ఛానెళ్లు మెంటార్‌షిప్‌ ఇస్తామంటూ సివిల్స్‌ ఆశావహ అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నాయని ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను సమర్పించారు. నకిలీ ఖాతాలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ రవీందర్‌రెడ్డిని వివరణ కోరగా.. ఏప్రిల్‌ 27వ తేదీన అనన్యరెడ్డి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని