లోయలో పడిన బస్సు

ఎగువ అహోబిలంలో ఆర్టీసీ బస్సు పది అడుగుల లోయలో పడింది. ముగ్గురు ప్రయాణికులు ఉన్నా.. ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Published : 30 Nov 2021 05:10 IST

తప్పిన పెను ప్రమాదం

ఆళ్లగడ్డ గ్రామీణ, న్యూస్‌టుడే: ఎగువ అహోబిలంలో ఆర్టీసీ బస్సు పది అడుగుల లోయలో పడింది. ముగ్గురు ప్రయాణికులు ఉన్నా.. ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆళ్లగడ్డ నుంచి ఎగువ అహోబిలానికి 15 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. ఎగువ అహోబిలంలో ప్రయాణికులను దించిన అనంతరం తిప్పుకొనేందుకు స్థలం లేకపోవడంతో కండక్టర్‌ సూచనలు చేస్తుండగా డ్రైవర్‌ బస్సు నెమ్మదిగా వెనుకవైపు నడిపాడు. ఈ క్రమంలో అదుపుతప్పిన బస్సు సమీపంలోని లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. డ్రైవర్‌ కమాల్‌ బాషా, ధర్మవరానికి చెందిన వెంకట లక్ష్మమ్మ, మైదుకూరుకు చెందిన ఓబులేసుతో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని