చిరుత దాడిలో ఏఎస్సై మృత్యువాత

మహారాష్ట్రలోని చంద్రపూర్‌- బల్లార్‌పూర్‌ మార్గంలో చిరుతపులి దాడిలో ఓ అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్సై) మృత్యువాత పడ్డారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం బల్లార్‌పూర్‌ పవర్‌హౌస్‌

Published : 05 Dec 2021 05:23 IST

బల్లార్ష, న్యూస్‌టుడే: మహారాష్ట్రలోని చంద్రపూర్‌- బల్లార్‌పూర్‌ మార్గంలో చిరుతపులి దాడిలో ఓ అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్సై) మృత్యువాత పడ్డారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం బల్లార్‌పూర్‌ పవర్‌హౌస్‌ వద్ద జరిగింది. అవినాశ్‌ పడోలే(42) చంద్రపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు ముగించుకుని వస్తుండగా రహదారి పక్కనే మాటువేసిన చిరుత ఆయనపై దాడిచేసింది. మరికొందరు అదే మార్గంలో వస్తుండటంతో చిరుత అడవిలోకి పారిపోయింది. తీవ్రగాయాలతో స్పృహతప్పి పడిపోయిన అవినాశ్‌ చికిత్స పొందుతూ మృతిచెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని