Crime News: లారీ చోరీ చేశాడు..మైకంలో బోల్తా కొట్టాడు!

కారో, బైకో ఎందుకనుకున్నాడో ఏమో.. ఓ దొంగ డ్రైవర్‌ ఏకంగా లారీనే చోరీ చేశాడు.. కానీ, తాగిన మైకంలో దాన్ని సరిగా నడపలేకపోవడంతో అది కాస్తా బోల్తా పడింది. దొంగ కూడా అందులో ఇరుక్కుపోయాడు..

Updated : 03 Jan 2022 06:44 IST

అపహరించి ఎత్తుకెళుతుండగా బోల్తాపడిన లారీ

గణపురం, న్యూస్‌టుడే: కారో, బైకో ఎందుకనుకున్నాడో ఏమో.. ఓ దొంగ డ్రైవర్‌ ఏకంగా లారీనే చోరీ చేశాడు.. కానీ, తాగిన మైకంలో దాన్ని సరిగా నడపలేకపోవడంతో అది కాస్తా బోల్తా పడింది. దొంగ కూడా అందులో ఇరుక్కుపోయాడు.. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగరం శివారులో శనివారం అర్ధరాత్రి జరిగింది. లారీ యజమాని మిరియాల మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గణపురం మండలం బస్వరాజుపల్లి 8వ గనిలో శనివారం రాత్రి లారీలో బొగ్గు లోడింగ్‌ చేశారు. యజమానే డ్రైవర్‌ కావడంతో హైదరాబాద్‌ వెళ్తూ.. మధ్యలో స్వగ్రామం గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి వద్ద రోడ్డు పక్కన లారీని నిలిపాడు. ఇంటికెళ్లి భోజనం చేసి తిరిగి వచ్చేసరికి లారీ కనిపించక కంగారు పడ్డాడు. ఎవరో ఎత్తుకెళ్లారని ఆరా తీయగా గాంధీనగరం వద్ద అది బోల్తాపడిందని తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా దొంగ డ్రైవర్‌ రేగొండ మండలం బాగిర్థిపేటకు చెందిన చేరాలు లారీలో ఇరుక్కుపోయి ఉన్నాడు. మాధవరెడ్డి, మరికొందరు అతన్ని బయటకు తీసి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని