అనిశాకు చిక్కిన ఉప తహసీల్దారు, సీనియర్‌ అసిస్టెంట్‌

ఆన్‌లైన్‌లో భూ మార్పిడి కోసం లంచం తీసుకుంటూ నారాయణపేటలో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. అనిశా డీఎస్పీ ఫయాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్‌ మండలంలోని రాకొండ గ్రామానికి చెందిన

Published : 08 Apr 2022 05:03 IST

రూ.3.50 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన వైనం

మరికల్‌, నారాయణపేట, న్యూస్‌టుడే : ఆన్‌లైన్‌లో భూ మార్పిడి కోసం లంచం తీసుకుంటూ నారాయణపేటలో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. అనిశా డీఎస్పీ ఫయాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మరికల్‌ మండలంలోని రాకొండ గ్రామానికి చెందిన ఓ రైతు తన భూమిని ఆన్‌లైన్‌లో మార్చాలని తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా.. ఇన్‌ఛార్జి తహసీల్దారు జగన్‌మోహన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ తాహెర్‌లు రూ.3.50 లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో ఆ రైతు హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రైతు రెవెన్యూ అధికారులను సంప్రదించగా.. డబ్బు మహబూబ్‌నగర్‌లో ఇవ్వాల్సిందిగా చెప్పారు. ఈ విషయాన్ని అనిశా అధికారులకు చెప్పడంతో వారు గురువారం రసాయనాలు పూసిన కరెన్సీ నోట్లను రైతుకు ఇచ్చి పంపారు. మహబూబ్‌నగర్‌లో చెప్పిన చోటుకు సాయంత్రం వెళ్లి రైతు ఇన్‌ఛార్జి తహసీల్దారు జగన్‌మోహన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ తాహెర్‌లకు డబ్బు ఇస్తుండగా.. అనిశా అధికారులు ఆ ఇద్దరినీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారిని మరికల్‌లోని కార్యాలయానికి తీసుకెళ్లి అర్ధరాత్రి వరకు విచారించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts