కలెక్టర్‌, జేసీ ఫోర్జరీ సంతకాలతో ఎన్‌ఓసీ

రూ.కోట్ల విలువైన భూములను అక్రమ పద్ధతుల్లో విక్రయించడానికి వైకాపాకు చెందిన ఓ కార్యకర్త కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్ల సంతకాలనే ఫోర్జరీ చేసి నకిలీ నిరభ్యంతర

Published : 23 May 2022 04:35 IST

రూ.కోట్ల విలువ భూమి విక్రయానికి వైకాపా కార్యకర్త ప్రయత్నం

అనంతపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రూ.కోట్ల విలువైన భూములను అక్రమ పద్ధతుల్లో విక్రయించడానికి వైకాపాకు చెందిన ఓ కార్యకర్త కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్ల సంతకాలనే ఫోర్జరీ చేసి నకిలీ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) సృష్టించిన ఉదంతం అనంతపురంలో వెలుగుచూసింది. కూడేరు మండలం కమ్మూరులో సర్వేనెంబరు 525, 526లో 34 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఆ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ భూ యాజమానులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దస్త్రం సంయుక్త కలెక్టరు వద్ద పెండింగ్‌లో ఉంది. కూడేరు మండలానికి చెందిన వైకాపా కార్యకర్త శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన వ్యక్తితో కలిసి ఓ వీఆర్వో సాయంతో నకిలీ ఎన్‌వోసీ సృష్టించాడు. ఈ భూమిని ఇటీవల యజమానులు విక్రయానికి పెట్టారు. అదే మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం సేకరించారు. కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్ల ఫోర్జరీ సంతకాలతో ఎన్‌ఓసీ జారీ చేసిన విషయం వాస్తవమేనని, దీనిపై విచారణ చేస్తున్నామని ఆర్డీవో మధుసూదన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని