అప్పుతీరక.. విత్తు మొలకెత్తక ఆగిన రైతు గుండె

సోయా విత్తనాలు మొలకెత్తక దిగులు చెందిన రైతన్న రెండో సారి విత్తే క్రమంలో గుండెపోటుకు గురయ్యారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మండలంలోని కుచులాపూర్‌

Published : 28 Jun 2022 05:36 IST

బోథ్‌, న్యూస్‌టుడే: సోయా విత్తనాలు మొలకెత్తక దిగులు చెందిన రైతన్న రెండో సారి విత్తే క్రమంలో గుండెపోటుకు గురయ్యారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మండలంలోని కుచులాపూర్‌ గ్రామానికి చెందిన ఎక్కర్ల శంకర్‌(50) తన నాలుగెకరాల పొలంతో పాటు కౌలుకు తీసుకున్న మరో నాలుగెకరాలలో సోయా విత్తనాలను విత్తారు. పది రోజులు గడిచినా మొలవకపోవడంతో దిగులు చెందారు. వ్యవసాయ అవసరాల కోసం 5 లక్షల వరకూ అప్పులు చేశారు. వాటిని ఎలా తీర్చాలని బాధపడుతూనే, మళ్లీ అప్పు చేసి విత్తనాలు కొని రెండో సారి విత్తుతూ సోమవారం సాయంత్రం గుండె పోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు బోథ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని