ఎస్‌బీఐ ఏజీఎంకు అయిదేళ్ల జైలు: సీబీఐ కోర్టు తీర్పు

హైదరాబాద్‌ ఎస్‌బీఐ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ జి.వి.జె.మోహన్‌కు అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1.25 లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది.

Published : 29 Jun 2022 05:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఎస్‌బీఐ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ జి.వి.జె.మోహన్‌కు అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1.25 లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఆయనతోపాటు భార్య బిందు వాణికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానా విధించింది. రెండు చెక్‌లను దుర్వినియోగం చేయడం ద్వారా రూ.30 లక్షలను సొంత ఖాతాల్లోకి మళ్లించినందుకు సీబీఐ 2015 మార్చిలో కేసు నమోదు చేసింది. కెఎంవీ ప్రాజెక్ట్స్‌ నుంచి 2012లో రూ.20 లక్షలకు, 2013లో రూ.10 లక్షలకు రెండు చెక్‌లను మోసపూరితంగా మోహన్‌కుమార్‌ తీసుకున్నారు. లోన్‌ సిండికేట్‌ ఫీజు, కన్సార్టియం ప్రాసెసింగ్‌ ఫీజుగా ఈ మొత్తాలకు చెక్‌లను తీసుకుని సొంత ప్రయోజనాలకు వినియోగించుకున్నారని సీబీఐ ఆరోపించింది. బ్యాంకుకు రూ.30 లక్షలు, వడ్డీ నష్టం కలిగించారని సీబీఐ అభియోగ పత్రం దాఖలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని