Kidnap: రూ.15 లక్షలు ఇస్తేనే మీ నాన్నను వదిలిపెడతాం.. కాళ్లు, చేతులు కట్టేసి కుమారుడికి ఫోన్‌

ముంబయి విమానాశ్రయం నుంచి వస్తున్న సమయంలో ఆ నగర శివార్లలో జూన్‌ 22న అపహరణకు గురైన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి చెందిన మత్తమల్ల

Updated : 01 Jul 2022 07:25 IST

పెగడపల్లి, న్యూస్‌టుడే: ముంబయి విమానాశ్రయం నుంచి వస్తున్న సమయంలో ఆ నగర శివార్లలో జూన్‌ 22న అపహరణకు గురైన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి చెందిన మత్తమల్ల శంకరయ్య ఇంకా కిడ్నాపర్ల చెర వీడలేదు. ఆగంతకులు గురువారం కాళ్లు, చేతులు కట్టేసి శంకరయ్యను బందీగా ఉంచిన ఫొటోను వాట్సప్‌లో ఆయన కుమారుడు హరీష్‌కు పంపించారు. అనంతరం ‘రూ.15 లక్షలు ఇస్తేనే వదిలిపెడతాం. మీరు ఎక్కడికి డబ్బులు తెచ్చిస్తారో చెప్పండంటూ’ ఇంటర్‌నెట్‌ ఫోన్‌ ద్వారా మాట్లాడుతూ హరీష్‌ను బెదిరించారు. దాంతో బాధిత కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన తాము రూ.15 లక్షలు ఎక్కణ్నుంచి తెచ్చివ్వగలమంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అపహరించిన వారు తన తండ్రిని చంపేస్తారేమోననే భయం వెంటాడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనపై ముంబయిలో కేసు నమోదైందని, అక్కడి పోలీసులు ఓ బృందాన్ని నియమించినప్పటికీ దర్యాప్తులో పురోగతి లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని