ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్ట్‌

ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఎమ్మెల్యేపై ఈ నెల 1న అదే జిల్లా

Published : 11 Aug 2022 04:29 IST

తాజాగా ఏడుగురిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు

జూబ్లీహిల్స్‌: ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఎమ్మెల్యేపై ఈ నెల 1న అదే జిల్లా మాక్లూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచి లావణ్యగౌడ్‌ భర్త పెద్దగాని ప్రసాద్‌గౌడ్‌ హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితుడైన ప్రసాద్‌గౌడ్‌ను అరెస్ట్‌ చేయగా.. తాజాగా మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చారు. ప్రసాద్‌గౌడ్‌తోపాటు ఆయన భార్య లావణ్యగౌడ్‌, కొండ సంతోష్‌గౌడ్‌, సంగరత్న, బొంత సుగుణ, సురేందర్‌, కారు డ్రైవర్‌ దమ్మయ్యసాగర్‌ను నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో సంతోష్‌గౌడ్‌, సుగుణ, సురేందర్‌, దమ్మయ్యసాగర్‌లను అరెస్ట్‌ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌, ఎస్సై బాలరాజు తెలిపారు. పరారీలో ఉన్న లావణ్యగౌడ్‌, సంగరత్న కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

కల్లెడ గ్రామానికి చెందిన సంతోష్‌గౌడ్‌ సాయంతో ప్రసాద్‌గౌడ్‌ నాంపల్లిలోని ఓ ఆర్మ్‌ దుకాణంలో ఎయిర్‌ పిస్టల్‌, 30 పెల్లెట్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు వివరించారు. నిజామాబాద్‌కు చెందిన సుగుణ ద్వారా పరిచయమైన సురేందర్‌ సహాయంతో బిహార్‌లో రూ.60 వేలతో దేశవాళీ తుపాకీ తీసుకున్నాడు. బుల్లెట్ల కోసం దమ్మయ్యసాగర్‌తో కలిసి ప్రసాద్‌గౌడ్‌ బిహార్‌ వెళ్లి అక్కడ మున్నాకుమార్‌ను కలిశాడని పోలీసులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని