అనారోగ్య సమస్యలతో దంపతుల బలవన్మరణం

సుమారు 45 ఏళ్ల వైవాహిక బంధం.. రెక్కలుముక్కలు చేసుకుని ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలను పెంచి పెద్దచేసి అందరికీ పెళ్లిళ్లు చేశారు. మనవళ్లు, మనవరాళ్లతో వృద్ధాప్యం ఆనందంగా గడపాల్సిన తరుణంలో ఇద్దరిని కంటి

Published : 19 Aug 2022 04:42 IST

గోరంట్ల, న్యూస్‌టుడే: సుమారు 45 ఏళ్ల వైవాహిక బంధం.. రెక్కలుముక్కలు చేసుకుని ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలను పెంచి పెద్దచేసి అందరికీ పెళ్లిళ్లు చేశారు. మనవళ్లు, మనవరాళ్లతో వృద్ధాప్యం ఆనందంగా గడపాల్సిన తరుణంలో ఇద్దరిని కంటి సమస్యలు చుట్టుముట్టాయి. ఆదరణ కొరవడిందన్న భావనతో జీవితంపై విరక్తి చెందారు. ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేమని భావించి కలిసి బలవన్మరణం పొందారు. ఈ విషాదకర సంఘటన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. వానవోలు గ్రామానికి చెందిన పాపన్న(65), వెంకటలక్ష్మమ్మ(61) వ్యవసాయంతోపాటు గొర్రెలను పెంచుతూ కుటుంబాన్ని పోషించేవారు. పాపన్నకు నాలుగేళ్ల కిందట కంటి సమస్య ఏర్పడి కన్ను కనిపించకుండా పోయింది. ఇటీవల ఆయన భార్యకూ కంటి సమస్య వచ్చింది. పెద్ద కుమారుడు సొంతూరిలోనే వేరుగా ఉంటుండగా, మరో కుమారుడు ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లారు. పట్టించుకునేవారు లేరన్న వేదనతో గురువారం తెల్లవారుజామున దంపతులిద్దరూ విషగుళికలను నీటిలో కలుపుకొని తాగారు. గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకటలక్ష్మమ్మ, హిందూపురం ఆసుపత్రిలో పాపన్న కన్నుమూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని