నలుగురు పీఎఫ్‌ఐ సభ్యుల అరెస్టు

ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారన్న ఆరోపణలతో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)పై చేపట్టిన దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నలుగుర్ని అరెస్టు చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు వీరిని రిమాండుకు

Published : 20 Sep 2022 04:43 IST

కోర్టు ఆదేశాలతో రిమాండుకు తరలింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారన్న ఆరోపణలతో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)పై చేపట్టిన దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నలుగుర్ని అరెస్టు చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు వీరిని రిమాండుకు తరలించింది. ధార్మిక కార్యకలాపాల పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ ఇస్తున్నారంటూ పీఎఫ్‌ఐపై నిజామాబాద్‌లో స్థానిక పోలీసులు తొలుత కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం దీన్ని ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు గతంలోనే ఒకసారి సోదాలు నిర్వహించారు. ఆదివారం రెండోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఈ సందర్భంగా పలు పత్రాలు, హార్డ్‌డిస్కులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బోధన్‌కు చెందిన సయ్యద్‌ సమీర్‌, ఆదిలాబాద్‌కు చెందిన ఫిరోజ్‌, జగిత్యాలకు చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌, నెల్లూరుకు చెందిన ఎండీ ఉస్మాన్‌లను అరెస్టు చేసి నాంపల్లిలోని నాలుగో అదనపు మున్సిపల్‌ సెషన్స్‌ జడ్జి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించడంతో వారిని చంచల్‌గూడా జైలుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని